ప్రియుడిని కలవడానికి ఇంటి నుంచి పారిపోయిన బాలీవుడ్ బ్యూటీ

కరీనా కపూర్.. దాదాపుగా ఈ పేరు అందరికీ సుపరిచితమే. బాలీవుడ్‌లో స్టార్ హీరోల అందరితో సినిమాలు చేసిన ఆమె.. ఇప్పటికీ అక్కడ టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌ను లవ్ మ్యారేజ్ చేసుకున్న ఆమె.. ఇప్పటికే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న కరీనా.. త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన టీనేజ్ వయస్సులో జరిగిన ఒక సంఘటన గురించి ఆమె బయటపెట్టింది. స్కూల్‌ టైమ్‌లో జరిగిన తన ప్రేమాయణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

KAREENA KAPOOR

15 ఏళ్ల వయస్సులో స్కూల్ టైమ్‌లో అక అబ్బాయిని ఇష్టపడ్డానని, ఆ విషయం తన తల్లికి తెలియడం వల్ల స్కూల్‌కి వెళ్లకుండా చేసిందని కరీనా కపూర్ తెలిపింది. అతడిని కలవకుండా తనను ఒక రూంలోకి పెట్టి తాళం వేసి బంధించిందని చెప్పింది. అయితే మా అమ్మ డిన్నర్‌కి బయటికి వెళ్లినప్పుడు తాను కత్తిని ఉపయోగించి తాళాన్ని పగలగొట్టానని చెప్పింది. ఇలా తప్పించుకుని తన బాయ్‌ఫ్రెండ్‌ను కలిశానని, ఇది చాలా చేదు సంఘటన అని కరీనా చెప్పింది.

ప్రస్తుతం అతడు తన తల్లికి మంచి క్లోజ్ ఫ్రెండ్ అని, తన భర్త సైఫ్ అలీ ఖాన్‌, అతడు మంచి స్నేహితులు అని కరీనా వెల్లడించింది. ఇక’ ప్రెగ్నెన్సీ బైబిల్’ పేరుతో ఒక పుస్తకం రాయనున్నట్లు ప్రకటించిన కరీనా.. పుస్తకం ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేసింది. కాబోయే తల్లులకు ఉపయోగపడేలా అవసరమైన చిట్కాలు, సమాచారాన్ని ఇందులో అందించనున్నట్లు తెలిపింది.