నితిన్-కీర్తి సురేశ్‌ రంగ్‌దే స‌రికొత్త పొస్ట‌ర్ రిలీజ్‌!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్‌- కీర్తి సురేశ్ కాంబోలో తెర‌కెక్కుతున్న రంగ్‌దే చిత్రాన్ని డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దాదాపు చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకొంటుంది. ఇటీవ‌లే ఈ చిత్ర విడుద‌ల తేదిని ప్ర‌క‌టించారు చిత్ర‌బృందం.. ల‌వ్‌, రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన రంగ్‌దే ను మార్చి 26న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

nithin-keerthisuresh

ఇప్పుడు ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతున్న స‌మ‌యం ఆస‌న్న‌మ‌వుతుంద‌ని, ప్ర‌మోష‌న్స్‌లో వేడి పెంచాల్సిన టైమ్ వ‌చ్చేసింది. తాజాగా సంక్రాంతి శుభాకాంక్ష‌ల‌తో మూవీ టీమ్ రంగ్‌దే లోని సరికొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేయ‌గా.. అందులో నితిన్‌-కీర్తి సురేశ్ ఆద్యంతం క‌ల‌ర్‌ఫుల్‌గా ఆక‌ట్టుకున్నారు. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర‌ నాగ‌వంశీ నిర్మిస్తుండ‌గా.. దేవిశ్రీ‌ప్ర‌సాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.