క‌మెడియ‌న్‌ సునీల్ “క‌న‌బ‌డుట‌లేదు”..

క‌మెడియ‌న్‌గా కెరీర్‌ని మొద‌లు పెట్టిన సునీల్ టాప్ క‌మెడియ‌న్ల‌లో ఒక‌డిగా పేరు తెచ్చుకున్నాడు సునీల్‌. అక్కడి నుంచి హీరోగా మారి మొద‌ట్లో మంచి హిట్స్ కొట్టినప్ప‌టికి ఆ త‌ర్వాత వ‌రుస అప‌జ‌యాలు సునీల్ ను వెంటాడాయి. దీంతో త‌న పాత న‌డ‌వ‌డిలోనే కమెడియ‌న్‌గా మారాడు. అందులో భాగంగానే చిత్రాల‌హ‌రి, అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌, అల వైకుంఠ‌పుర‌ములో ప‌లు సినిమాల్లో క‌నిపించిన సునీల్‌కు క‌మెడియ‌న్‌గా పేరు మాత్రం రాలేదు. ఈ నేప‌థ్యంలోనే సునీల్ ఓ వైపు క‌మెడియ‌న్‌గా పాత్ర‌లు చేస్తూ..

sunil new movie poster

మ‌రోవైపు విల‌న్‌గా, పోలీస్ ఆఫీస‌ర్‌గా ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌లు చేయ‌డానికి రెడీ అయిపోయాడు. ర‌వితేజ హీరోగా తెర‌కెక్కిన డిస్కోరాజా చిత్రంలో సునీల్ విల‌న్ పాత్ర చేసి క‌ల‌ర్‌ఫోటో సినిమాలో పూర్తి స్థాయిలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో మెప్పించాడు ఈ సినిమాలో సునీల్ సీరియ‌స్ పెర్ఫార్మెన్స్‌తోనే విల‌నిజాన్ని సునీల్ పండించాడు. ఇక సునీల్ హీరోగా తాజా చిత్రం క‌న‌బ‌డుట‌లేదు. ఈ సినిమాలో సునీల్ డిటెక్టివ్ రామ‌కృష్ణ‌గా తెర‌పై క‌నిపించ‌నున్నాడు. సంక్రాంతి శుభాకాంక్ష‌ల‌తో ఈ సినిమా నుండి ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. ఈ పోస్ట‌ర్లో సునీల్ డిటెక్టివ్ లుక్‌లో ఇన్వెస్టిగేట్ చేస్తూ క‌నిపించ‌గా.. ఈ సినిమాను యువ ద‌ర్శ‌కుడు బాల‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. స్పార్క్ వీడియోస్‌.. స్టూడియోస్ షేడ్‌.. ఎస్‌.ఎస్‌. ఫిలింస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.