వెంక‌టేశ్ “నార‌ప్ప” ఫ్యామిలీని చూశారా!‌

విక్ట‌రీ వెంక‌టేశ్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం నార‌ప్ప. ఈ సినిమా త‌మిళంలో హీరో ధ‌నుష్ న‌టించిన చిత్రం అసుర‌న్ కు ఇది తెలుగులో రీమేక్‌గా వ‌స్తుంది. ఈ చిత్రాన్ని శ్రీ‌కాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్ల‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ సినిమాలో వెంక‌టేశ్ స‌ర‌స‌న ప్రియ‌మ‌ణి క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా.. వెంక‌టేశ్ పెద్ద కొడుకుగా కేరాఫ్ కంచ‌ర‌పాలెం ఫేం కార్తీక్ ర‌త్నం న‌టిస్తున్నాడు. తాజాగా సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలుపుతూ.. చిత్ర‌బృందం స‌రికొత్త లుక్‌ను విడుద‌ల చేశారు.

narappa

ఇందులో వెంక‌టేశ్‌, ప్రియ‌మ‌ణి, కంచ‌ర‌పాలెం ఫేం కార్తీక్ ర‌త్నం ఇలా ఫ్యామిలీ అంతా ఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. వెంక‌టేశ్ ఎన్న‌డూ లేని విధంగా ఈ సినిమాలో వైవిధ్యభ‌రిత పాత్రలో పోషిస్తున్నాడు. నిజానికి ఈ పాటికే ఈ చిత్రం విడుద‌ల కావాల్సి ఉంది.. కానీ క‌రోనా వ్యాప్తి కార‌ణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా ప‌డింది. ఈ చిత్రంలో రావు ర‌మేశ్‌, ప్ర‌కాశ్‌రాజ్‌, మురళీకృష్ణ, సంప‌త్‌రాజ్ , రాజీవ్ క‌న‌కాల ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.‌