సమ్మర్ కోసం వెయిట్ చేస్తున్న మెగా డాటర్

ఇటీవలే కోరుకున్నవాడిని వెళ్లిచేసుకుని మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ చేసింది మెగా డాటర్ నిహారిక. అంగరంగ వైభవంగా ఈ పెళ్లి జరగ్గా.. హానీమూన్‌ని కూడా ఎంజయ్ చేసింది. ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టిన నిహారిక.. ఒక వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. అయితే సమ్మర్ కోసం వెయిట్ చేస్తున్నాను అంటోంది నిహారిక.

NIHARIKA ABTEASEROUR ACHARYA

చిరు-కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ఆచార్య టీజర్ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో చిరు లుక్, డైలాగ్స్, రాంచరణ్ వాయిస్ ఓవర్, ఫైట్ సీన్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం యూట్యూబ్‌లో 7 మిలియన్ల వ్యూస్‌తో ఈ టీజర్ దూసుకుపోతోంది. సమ్మర్‌లో మే 13న ఈ సినిమా విడుదల కానుంది. సినిమా రిలీజ్ డేట్‌ను కూడా నిన్న మేకర్స్ ప్రకటించారు.

ఈ క్రమంలో దీనిపై నిహారిక ట్వీట్ చేసింది. ‘డాడీ.. నిన్నిలా చూస్తుంటే వామ్మో అదిరిపోతుంది.. మీ యాక్షన్ సూపర్.. సమ్మర్ వరకు ఆగాలా.. అంతవరకు వెయిట్ చేయడం వల్ల కాదు.. ఈ సమ్మర్ ఏదో త్వరగా వచ్చుంటే బాగుండు” అంటూ ట్వీట్ చేసింది.