తార దిగి వచ్చిన వేళ…

దక్షిణాది లేడీ సూపర్ స్టార్‌గా సోలో సినిమాలు చేస్తూ సాలిడ్ హిట్స్ అందుకుంటూనే స్టార్ హీరోల సినిమాల్లో కూడా కనిపిస్తున్న నయనతార కోలీవుడ్ లో మూవీలో నటిస్తుంది అంటే ఆమె కోసమే థియేటర్ కి వచ్చే ప్రేక్షకులు ఉన్నారు. ప్రస్తుతం నయన్ కి ఉన్న క్రేజ్ ఏ సౌత్ హీరోయిన్ లేదు అనడం అతిశయోక్తి కాదేమో. వరసగా సినిమాలు చేస్తున్న నయన్, ఆ సినిమాల ప్రొమోషన్స్ కి మాత్రం దూరంగా ఉంటుంది. ఎంత పెద్ద సినిమా చేసినా, ఆ మూవీ ఫంక్షన్స్ కి ప్రమోషనల్ ఈవెంట్స్ కి మాత్రం నయనతార రాదు. నయన్ తో సినిమాలు చేయాలి అనుకునే వాళ్లు ఈ కండీషన్ ని మైండ్ లో పెట్టుకొనే మెంటల్ గా ప్రిపేర్ అవుతారు.

చాలా రోజులుగా ఇదే ఫాలో అవుతున్న నయన్ లేటెస్ట్ గా మెగాస్టార్ సైరాతో పాటు ఇళయదళపతి బిగిల్ సినిమాలో నటించింది. రిలీజ్ కి రెడీగా ఉన్న ఈ రెండు సినిమాలు భారీ బడ్జట్ తో తెరకెక్కినవే కావడంతో ఈ రెండు సినిమాలకు ప్రమోషన్ కండిషన్ కి నయన్ మినహాయింపు ఇచ్చిందట. త్వరలో చెన్నైలో జరగనున్న సైరా ప్రమోషనల్ ఈవెంట్‌తో పాటు 22న హైదరాబాద్ లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నయన్ రాబోతుందని సమాచారం. సైరా కన్నా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కన్నా ముందు ఈ నెల 19న విజయ్ బిగిల్ సినిమా ఆడియో లాంఛ్ జరగనుంది. ఈ గ్రాండ్ ఈవెంట్ కి రమ్మని చిత్ర యూనిట్, నయన్‌కు ఇన్విటేషన్ పంపించారట. నయన్ కి అట్లీ, విజయ్ ఇద్దరూ చాలా క్లోజ్ కాబట్టి ఆడియో లాంచ్ కి రావడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఎన్నో ఏళ్ల తర్వాత ఒక సినిమా ప్రొమోషన్స్ కి నయన్ వెళ్లడం ఆమె అభిమానులకి చాలా స్పెషల్ న్యూస్.