సెంట్రల్ జైల్లో లోకనాయకుడు

1996లో వచ్చిన భారతీయుడు సినిమాకి 23 ఏళ్ల తర్వాత సీక్వెల్ ప్లాన్ చేసిన శంకర్, కమల్ భారతీయుడు 2 సినిమాతో బిజీగా ఉన్నారు. బడ్జట్ ఇష్యూస్ క్లియర్ చేసుకున్న భారతీయుడు 2 సినిమాని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తుంది. కమల్ హాసన్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ మరో జోడీగా నటిస్తున్నారు. ఇటీవలే చెన్నై షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న భారతీయుడు 2 సినిమా లేటెస్ట్ షెడ్యూల్ సెప్టెంబర్ 19న మొదలు కాబోతోంది. మెయిన్ స్టార్ కాస్ట్ అంతా పాల్గొననున్న ఈ లేటెస్ట్ షెడ్యూల్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో జరుగుతోంది. సమాజంలో అవినీతిపై శంకర్ సంధించిన సినిమా అస్త్రం ‘భారతీయుడు’. ఈ సీక్వెల్ లో సేనాపతి ఏ సమస్యలను ప్రస్తావిస్తాస్తున్నారో చూడాలి.