ట్రాన్స్‌జెండర్‌ పాత్రలో నయనతార

తెలుగు, తమిళ భాషల్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా కొనసాగింది నయనతార. రెండు భాషల్లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న స్టార్ హీరోయిన్‌గా ఈ అమ్మడు పేరు సంపాదించుకుంది. తెలుగు, తమిళ భాషల్లో ఆమెకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం తెలుగులో తక్కువ సినిమాలు చేస్తున్నా.. కోలీవుడ్‌లో మాత్రం వరుసపెట్టి సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది.

nayanatara

తమిళ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయనతార.. ఇవాళ తన పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సినీ సెలబ్రెటీలందరూ ఆమెకు విషెస్ చెబుతున్నారు. నయనతార పుట్టినరోజు సందర్భంగా ప్రస్తుతం విఘ్నేష్ శివన్ డైరెక్షన్‌లో ఆమె చేస్తున్న ‘నెర్టిక్కన్’ సినిమా ఫస్ట్‌లుక్‌ను సినిమా యూనిట్ విడుదల చేసింది.

ఇందులో బ్లైండ్ ట్రాన్స్‌జెండర్ పాత్రలో నయనతార నటిస్తోంది. ఇక మిలంట్ రావు దర్శకత్వంలో నయనతార చేస్తున్న సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తవ్వగా.. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. కొరియన్ భాషలో సూపర్ హిట్ అయిన సినిమాను తమిళంలో రీమేక్ చేశారు. ఈ సినిమా నయనతారకు మంచి పేరును తెచ్చి పెడుతుందని మేకర్స్ చెబుతున్నారు.