గెటప్ మార్చిన నాని… అంటే సుందరానికి షురూ…

నాచురల్ స్టార్ నాని… ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. కరోనా సెకండ్ వేవ్ టైంలో కూడా షూట్ చేసిన నాని, అనుకున్న టైంకి శ్యామ సింగ రాయ్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశాడు. కొంచెం గ్యాప్ తర్వాత ఇటివలే మళ్లీ షూటింగ్ మొదలు పెట్టిన నాని, శరవేగంగా శ్యామ సింగ రాయ్ కంప్లీట్ చేశాడు. ఈ సినిమాకి గుమ్మడి కాయ కొట్టేసిన న్యాచురల్ స్టార్ తన నెక్స్ట్ సినిమాకి రెడీ అయిపోయాడు. ప్రమోషన్స్ విషయంలో ఎప్పుడూ కొత్తగా ఎదో ఒకటి చేసే ఈ హీరో, తాను అంటే సుందరానికి షూటింగ్ మొదలుపెడుతున్నాను అనే విషయాన్ని కూడా చాలా కొత్తగా చెప్పాడు.

తన క్యారవ్యాన్ నుంచి వీడియో రిలీజ్ చేసిన నాని, శ్యామ సింగ రాయ్ లుక్ కోసం పెంచిన మీసం ట్రిమ్ చేసి “మనకి వచ్చింది ఒక్కటే, సినిమా… ఆన్ టు ఎ న్యూ జర్నీ” అంటూ ట్వీట్ చేశాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ మూవీకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత నజ్రియా ఈ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకి రానుంది. గతంలో నజ్రియా మనకి పరిచయం అయింది డబ్బింగ్ సినిమాలతోనే అయినా కూడా ఆమెకి మన దెగ్గర మంచి క్రేజ్ ఉంది. ఫాహద్ ఫజిల్ తో పెళ్లి తర్వాత సినిమాలకి కాస్త దూరం అయిన నజ్రియాకి టాలెంటెడ్ యాక్ట్రెస్ అనే పేరు ఉంది. న్యాచురల్ స్టార్ నానికి నజ్రియా నుంచి గట్టిపోటినే రాబోతోంది. ఫ్రెష్ పైర్ గా ఈ ఇద్దరూ ప్రేక్షకులని ఎంత వరకూ అలరిస్తారో చూడాలి.