అతనితో అయిదో సినిమా చేస్తున్న ధనుష్…

కోలీవుడ్ మోస్ట్ కన్సిస్టెంట్ స్టార్ హీరో ఎవరైనా ఉన్నారా అంటే అందరి నుంచి వచ్చే ఒకేఒక్క పేరు ధనుష్. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో కమర్షియల్ హిట్స్ ఇస్తున్న ధనుష్ 2021లో రెండు చిత్రాలతో ప్రేక్షకులని పలకరించాడు. అందులో ఒకటి సూపర్ హిట్ మూవీ కర్ణన్ కాగా మరొకటి కార్తి సుబ్బరాజ్ తో చేసిన జగమే తంత్రం. నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ మిక్స్డ్ రివ్యూస్ తెచ్చుకుంది. రెండు సినిమాలతో ఫ్యాన్స్ ని ఖుషి చేసిన ధనుష్, తన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇచ్చేశాడు.

హాలీవుడ్ ప్రాజెక్ట్ గ్యారీ మాన్ షూటింగ్ కంప్లీట్ చేసిన ధనుష్ ప్రస్తుతం కార్తీక్ నరేన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. D43 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ ని మేకర్స్ జూలై 28న ఉదయం 11 గంటలకి రిలీజ్ చేయనున్నారు. జీవీ ప్రకాష్ మ్యూజిక్ ఇస్తున్న ఈ ప్రాజెక్ట్ పై కోలీవుడ్ లో చాలా అంచనాలు ఉన్నాయి. ద్రువంగల్ పదినారు, మాఫియా చాప్టర్ 1 లాంటి న్యూ ఏజ్ థ్రిల్లర్స్ ఇచ్చిన కార్తీక్ నరేన్ డైరెక్షన్ లో ధనుష్ యాక్ట్ చేస్తుండడం ఈ హైప్ కి ఒక కారణం అయితే, ధనుష్ జీవీ ప్రకాష్ మ్యూజికల్ కాంబినేషన్ అయిదో సారి రిపీట్ అవుతూ ఉండడం మరో కారణం. ఈ ఇద్దరూ కలిసి చేసిన సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. గతంలో జీవీ ప్రకాష్ ధనుష్ కాంబినేషన్ లో పొల్లాదవన్, ఆడుకలం, మైకం ఎన్న,అసురన్ లాంటి చార్ట్ బస్టర్స్ వచ్చాయి.