డిఫ‌రెంట్ టైటిల్‌తో నాని

విభిన్న క‌థ‌ల‌ను ఎంచుకుంటూ ప్రేక్ష‌కుల‌కు స‌ర్‌ప్రైజ్‌లు ఇస్తూ ఉంటాడు నేచుర‌ల్ స్టార్ నాని. ఫ్యామిలీ ఆడియ‌న్స్ నుంచి మాస్ ఆడియ‌న్స్ వ‌ర‌కు ప్ర‌తిఒక్క‌రూ ఇష్ట‌ప‌డే సినిమాలు చేస్తూ ఉంటాడు. ఆ హీరో.. ఈ హీరో అనే తేడా లేకుండా అంద‌రి అభిమానులు నాని సినిమా చూస్తారు. అందుక్ స్టార్ హీరోగా నాని పేరు తెచ్చుకున్నాడు. అసిస్టెంట్ డైరెక్ట‌ర్ నుంచి హీరో అయిన నానికి ఎలాంటి స్టోరీలు ఎంచుకోవాల‌నేది బాగా తెలుసు.. అందుకే మంచి క‌థ‌ల‌ను ఎంచుకుంటూ ఉంటాడు.

తాజాగా మ‌రో కొత్త క‌థ‌తో క్రేజీ టైటిల్‌తో నాని ప్రేక్షకుల ముందుకు వ‌చ్చాడు. మైత్రి మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై నాని చేస్తున్న సినిమాకు ‘అంటే.. సుందరానికీ’ అనే డిఫ‌రెంట్ టైటిల్ ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించి ఒక వీడియోను సినిమా యూనిట్ విడుద‌ల చేసింది. ఇందులో లుంగీతో సూట్‌కేస్ ప‌ట్టుకుని నాని క‌నిపించాడు. చూడటానికి ఈ వీడియో చాలా ఆస‌క్తిక‌రంగా ఉంది. నవీన్ యెర్నేని – రవిశంకర్ వై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నుండ‌గా.. మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా దీనిని తెర‌కెక్కిస్తున్నారు.

త్వ‌ర‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండ‌గా.. 2021లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. మలయాళ స్టార్ హీరోయిన్ నజ్రియా ఫహాద్ ఈ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం కానుంది. వివేక్ సాగర్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నుండ‌గా.. రవితేజ గిరిజాల ఎడిటర్ గా ప‌నిచేయ‌నున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.