మాజీ లవర్‌తో ఆడేసుకుంటున్న అమలాపాల్

వివాదాల‌తో ఎప్పుడూ వార్త‌ల్లో ఉంటూ ఉంటుంది బోల్డ్ బ్యూటీ అమ‌లాపాల్. తాజాగా మ‌రో వివాదంతో ఈ అమ్మ‌డు వార్త‌ల్లొకెక్కింది. తెలుగుతో పాటు త‌మిళంలో హీరోయిన్‌గా గుర్తింపు పొందిన ఈ బ్యూటీ.. ప్ర‌స్తుతం తెలుగులో ఎలాంటి సినిమాలు చేయ‌డం లేదు. త‌మిళంలో మాత్రం ప‌లు సినిమాలు చేస్తోంది. సినిమాల కన్నా.. వ్యక్తిగత విషయాలతో వార్తల్లో ఉండే అమలాపాల్.. ఇప్పుడు తన మాజీ ప్రియుడిపై కోర్టుకెక్కింది.

2014లో తమిళ దర్శకుడు ఎ.ఎల్ విజయ్‌ను అమలాపాల్ లవ్ మ్యారేజ్ చేసుకుంది. కొద్దిరోజుల తర్వాత గొడవల తర్వాత వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ సింగర్ భవింద్ సింగ్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. అమలాపాల్‌తో ఉన్న ఫొటోలను భవింద్ సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు.

దీంతో తన ఫొటోను భవిందర్ సింగ్ పోస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అమలాపాల్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ఫొటోలు షేర్ చేయవద్దని భవిందర్ సింగ్‌కు ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోల మీద వివరణ ఇవ్వాలని హైకోర్టు తెలిపింది.