తారక్‌తో రోమాన్స్‌ చేస్తానంటున్న బోల్డ్ బ్యూటీ

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కేతికా శర్మ నటించనుందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ముందుగా స్టార్ హీరోయిన్ పూజాహెగ్దేను తీసుకోవాలని అనుకున్నారు. ఆ తర్వాత కీర్తి సురేష్ అనుకున్నారు. కానీ వారిద్దరు వరుస షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్ల డేట్స్ వీలు కాలేదు. దీంతో కేతికా శర్మను సంప్రదించగా.. ఎన్టీఆర్‌తో కలిసి నటించేందుకు ఆమె ఒకే చెప్పేసినట్లు తెలుస్తోంది.

కేతికా శర్మ ప్రస్తుతం ఆకాష్ పూరీతో కలిసి నటిస్తోంది. ఇక ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తైన తర్వాత త్రివిక్రమ్ సినిమాలో తారక్ నటించనున్నాడు. ఆ లోపు కేతికా శర్మ కూడా ఫ్రీ కానుంది. గ్లామర్ పాత్రలో చేయడంలో కేతికా శర్మ దిట్ట. ఇప్పుడు ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలో ఆమె ఆదాల ఆరబోత ఎలా ఉంటుందనేది చూడాలి.

గతంలో ఎన్టీఆర్ -త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో వారిద్దరి కాంబోలో వస్తున్న ఈ రెండో సినిమా కోసం తారక్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.