భారీ మల్టీస్టారర్‌కు రెడీ అయిన సూర్య.. ఈ సారి ఎవరితోనో తెలుసా?

సూర్య హీరోగా ఇటీవల విడుదలైన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ జోష్‌లో మరో సినిమాకు సూర్య ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. బాలా దర్శకత్వంలో ఒక భారీ మల్టీస్టారర్ సినిమాకు సూర్య ఓకే చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. ఇందులో సూర్యతో పాటు ఆర్య, అథర్వ నటిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం చర్చలు జరుగుతుండగా… త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

ప్రయోగాలు చేయడంలో సూర్య ఎప్పుడూ ముందు ఉంటాడు. గతంలో విశాల్, ఆర్యలతో కలిసి వాడు వీడు సినిమాలో సూర్య నటించాడు. ఇక హీరో విక్రమ్‌తో కలిసి శివపుత్రుడు సినిమా చేయగా.. మోహన్ లాల్‌తో కలిసి బందో బస్త్ సినిమా చేశాడు. ఈ సినిమాలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో.. మరో మల్టీస్టారర్ సినిమాకు సూర్య ఓకే చెప్పేశాడట.

గతంలో బాలా దర్శకత్వంలో వస్తున్న నందా, శివపుత్రుడు సినిమాలో సూర్య నటించాడు. ప్రస్తుతం మణిరత్నం తెరకెక్కిస్తున్న నవరస అనే సినిమాలో సూర్య నటించాడు. దీని తర్వాత ఈ మల్టీస్టారర్ సినిమా పట్టాలెక్కనుందని టాక్.