వరుడుగా నాగశౌర్య.. వధువు ఎవరో తెలుసా?

అ, ఆ, జెర్సీ లాంటి సినిమాలను నిర్మించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న సినిమాకు ‘వరుడు కావలెను’ అనే టైటిల్ ఖరారు అయింది. ఈ మేరకు సినిమా యూనిట్ అధికారికంగా చెబుతూ ఒక వీడియో విడుదల చేసింది. ఇందులో నాగశౌర్య హీరోగా నటిస్తుండగా.. అతడి సరసన రీతు వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. లక్ష్మీ సౌజన్య అనే కొత్త దర్శకురాలు ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం కానుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

naga sourya

నాగశౌర్య, రీతువర్మతో పాటు మిగిలిన నటీనటీలపై పలు సీన్లను తెరకెక్కిస్తున్నారు. దీపావళి సందర్భంగా ప్రేక్షకులకు విషెస్ చెబుతూ ఆ సినిమా యూనిట్ ఒక వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో నాగశౌర్య, రీతువర్మ ఎంతో అందంగా కనిపించారు.

ఈ సినిమాలో నదియా, మురళీశర్మ, వెన్నెల కిశోర్, ప్రవీణ్ కామార్ కీలక పాత్రలలో నటించనున్నారు. పడిపడి లేచేస మనసు ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తుండగా.. సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పెళ్లిచూపులు, కేశవ లాంటి సినిమాల తర్వాత తెలుగులో ఎలాంటి సినిమాలు చేయని రీతువర్మ మళ్లీ ఈ సినిమాతో అభిమానుల ముందుకు వస్తోంది.