నాని సినిమాలో కొత్త భామ

దీపావళి సందర్భంగా నాని 28వ సినిమాకు సంబంధించిన వివరాలను మేకర్స్ వెల్లడించారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుండగా.. ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ వంటి హిట్ సినిమాలను తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఇందులో నాని సరసన మలయాళ యంగ్ బ్యూటీ నజ్రియా పహద్‌ను హీరోయిన్‌గా సినిమా యూనిట్ ఎంపిక చేసింది.

nani

మలయాళ, తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నజ్రియా.. నానితో చేయనున్న సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. నవంబర్ 21న ఈ సినిమా టైటిల్ ప్రకటించనున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా వివేక్ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడని తెలుస్తోంది.

ప్రస్తుతం శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ‘టక్ జగదీశ్’ సినిమా షూటింగ్‌లో నాని పాల్గొంటున్నాడు. గతంలో వారిద్దరి కాంబోలో వచ్చిన ‘నిన్ను కోరి’ సినిమా విజయం సాధించడంతో.. ‘టక్ జగదీశ్’ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇది పూర్తైన నాని కొత్త సినిమా ప్రారంభం కానుంది.