మళ్లీ అదే ఫార్ములా. . ‘RRR’ తర్వాత బ్రేక్ తీసుకోనున్న జక్కన్న?

స్టార్ హీరోలతో వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న దర్శకధీరుడు రాజమౌళి ‘RRR’ తర్వాత బ్రెయిన్‌కు కాస్త బ్రేక్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ‘RRR’ పూర్తైన వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేయనున్నాడనే వార్తలు వచ్చాయి. కానీ ఆ మూవీ మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. ‘RRR’ తర్వాత కాస్త బ్రేక్ తీసుకుని చిన్న హీరోలతో సినిమా చేయాలనే ఆలోచనలో జక్కన్న ఉన్నాడట.

RAJAMOULI

బాహుబలి సిరీస్ తర్వాత వెంటనే RRR సినిమాను రాజమౌళి ప్రారంభించాడు. స్టార్ హీరోలతో సినిమాలు చేయడంతో పాటు భారీ బడ్జెట్ సినిమాలు తీయడమంటే మాములు విషయం కాదు. చాలా ఒత్తిడి ఉంటుంది. RRR పూర్తైన వెంటనే మళ్లీ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో సినిమా తీయాలంటే కొంచెం ప్రెజర్ ఉంటుంది.

దీంతో తక్కువ బడ్జెట్‌తో చిన్న హీరోలతో సినిమా చేయాలని రాజమౌళి భావిస్తున్నాడట. దీని తర్వాత మహేష్‌తో సినిమా చేయనున్నాడట. గతంలో మగధీర లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాను తెరకెక్కించిన తర్వాత సునీల్‌తో మర్యాద రామన్న అనే సినిమాను జక్కన్న తీశాడు. ఇప్పుడు RRR తర్వాత అదే ఫార్ములాను ఫాలో కానున్నాడనే చర్చ జరుగుతోంది.