మరో ప్రేమకథతో రెడీ అయ్యారు

Shooting of Sai Pallavi, Naga Chaitanya’s film with Sekhar Kammula kickstarts

అక్కినేని కుర్రాడు నాగ చైతన్య స్పీడ్ పెంచి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ఓకే చేస్తున్నాడు. రీసెంట్ గా మజిలీ సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న చై, ఇప్పుడు అదే జోష్ ని కంటిన్యూ చేస్తూ మరో లవ్ స్టోరీని మొదలు పెట్టాడు. మజిలీ సినిమా రిలీజ్ సమయంలోనే నాగ చైతన్య, ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా సైన్ చేసిన సంగతి తెలిసిందే. నాగ చైతన్య పక్కన మొదటిసారి సాయి పల్లవి హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకోని రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టిన శేఖర్ కమ్ముల, మరోసారి హిట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. సాయి పల్లవి, నాగ చైతన్యల ఫ్రెష్ కాంబినేషన్… పల్లవి, శేఖర్ కమ్ములల హిట్ కాంబినేషన్ కలుస్తూ ఉండడంతో ఈ ప్రాజెక్ట్ పై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.