ఝాన్సీ రాణి కథ చెప్తే… రోమాలు నిక్కబొడుచుకుంటాయి

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జట్ సినిమా సైరా. స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యవలవాడ నరసింహారెడ్డి కథతో రూపొందిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ ప్లే చేస్తూ తెల్లదొరలపై దండెత్తనున్నాడు. అన్ని ఇండస్ట్రీల టాప్ స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాని అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేయనున్నారు. మెగా అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో లేడీ సూపర్ స్టార్ అనుష్క, ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో నటించింది.

ఉయ్యాలవాడ కథని చెప్పే పాత్రలో వీరనారిగా కనిపించనున్న అనుష్కకి సైరాలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట. ఝాన్సీ లక్ష్మీబాయ్, రేనాటి సూర్యుడి కథ చెప్తుంటే థియేటర్లో సినిమాలు చూసే ప్రేక్షకులకి రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుందట. అనుష్క పాత్రని చాలా స్పెషల్ గా డిజైన్ చేసిన చిత్ర యూనిట్, త్వరలోనే అనుష్క లుక్ ని రివీల్ చేయబోతున్నారట. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.