ఆ హీరోకి చుక్కలు చూపించడానికి విలన్ అయ్యింది

కుమారి 21F సినిమాతో తన అందం అభినయంతో యూత్ ని ఫిదా చేసిన బ్యూటీ హెబ్బా పటేల్. అతి తక్కువ కాలంలోనే సెన్సేషన్ మారిన హెబ్బా, ఆ తర్వాత చాలా సినిమాలు చేసినా కూడా ఊహించిన కెరీర్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయింది. పైగా మధ్యలో కాస్త షేప్ అవుట్ కూడా అవ్వడంతో హెబ్బాకి అవకాశాలు తగ్గాయి. దీంతో ఈ ముంబై బ్యూటీ సినిమాలని కాస్త గ్యాప్ తీసుకోని తన లుక్ పై వర్క్ చేసిన హెబ్బా పటేల్, మళ్లీ స్క్రీన్ పైన మెరవడానికి సిద్దమయ్యింది.

ఇప్పటి వరకూ హీరోయిన్ గా కనిపించిన హెబ్బా పటేల్, ఇప్పుడు విలన్ అవతారమెత్తడానికి రెడీ అయ్యింది. ఛలో సినిమాతో మంచి హిట్ అందుకున్న వెంకీ కుడుముల, తన సెకండ్ సినిమాని యంగ్ నితిన్ తో భీష్మ సినిమా చేస్తున్నాడు. క్రిష్టమస్ సందర్భంగా డిసెంబర్ 27న రిలీజ్ కానున్న ఈ సినిమాలో హెబ్బా పటేల్ లేడీ విలన్ పాత్రలో కనిపించనుంది. 24 కిస్సెస్ తర్వాత హెబ్బా పటేల్ నటించనున్న సినిమా ఇదే కావడం విశేషం. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వెన్నల కిశోర్ అండ్ నితిన్ ట్రాక్ హైలెట్ అవుతుందని సమాచారం. మరి ఈ మూవీతో అయినా మన కుమారి బ్యూటీ మంచి కంబ్యాక్ ఇస్తుందేమో చూడాలి.