సైరా సెన్సార్ రిపోర్ట్ అదిరింది

సైరా సినిమా రిలీజ్ కి రెడి అవుతుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న సైరా సెన్సార్ పనులు కూడా పూర్తి అయ్యాయి. ఈ మాగ్నమ్ ఓపస్ కి సెన్సార్ బోర్డు క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. సెన్సార్ టాక్ ప్రకారం సైరా సినిమా ఫస్ట్ హాఫ్ విజువల్ స్పెక్టకులర్ గా ఉంటుందని, మొదటి భాగంలో ఉయ్యాలవాడ పర్సనల్ లైఫ్ ఎలా ఉండేది అని చూపించనున్నారట. ఇక సెకండ్ హాఫ్ లో ఉయ్యాలవాడ ఉద్యమం చూపించబోతున్నారట, ఈ భాగంలో గూస్ బాంప్స్ వచ్చే సన్నివేశాలు చాలా ఉంటాయని తెలుస్తోంది. చిరు ఉయ్యాలవాడ పాత్రలో అద్భుతంగా నటించడాని, ముందెన్నడూ చూడని మెగాస్టార్ ని చూడబోతున్నామని సమాచారం.

ప్రతి పాత్ర సినిమా స్థాయిని పెంచేదిగా ఉండగా, జగపతి బాబు క్యారెక్టర్ కి మాత్రం స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంటుందట. జగ్గూభాయ్ పాత్రకి ఉండే ట్విస్ట్ సినిమాకే హైలైట్ అవుతుందట. క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తోంది. ఓవరాల్ గా సైరా సినిమా ఒక విజువల్ ట్రీట్ గా ఉంటుందట. సినిమాని చూసి బయటకి వచ్చే వాళ్లు ఒక గొప్ప వీరుడి కథ చూశాం అనే ఫీలింగ్ తో బయటకి వస్తారట. ఈ టాక్ వింటుంటే అక్టోబర్ 2న సైరా చేయబోయే సందడి ఏ స్థాయిలో ఉంటుందో చూడండి. ఫస్ట్ డే రికార్డుల ఎన్ని లేచిపోతాయో ఊహించుకోండి.