స్టార్ కమెడియన్ వేణు మాధవ్ అకాల మరణం

తెలుగు చిత్రసీమలో కమెడియన్‌గా తనదైన ముద్రను వేసుకున్న ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ గత కొంతకాలంగా లివర్ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల సమస్య తీవ్రం కావడంతో సికింద్రాబాద్ యశోదా హాస్పటల్‌లో చేరారు. 28-09-1968న కోదాడలో పుట్టిన వేణు మాధవ్, కిడ్నీ సమస్యలు కూడా తలెత్తడంతో ఆయన ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని హాస్పటల్ వైద్యులు చెప్తూ వచ్చారు. ట్రీట్మెంట్ కి రెస్పాండ్ కానీ వేణు మాధవ్(51) ఈరోజు మధ్యాహ్నం 12.21 నిమిషాలకి మరణించారు. అలీ, బ్రహ్మానందంతో పాటు వేణు మాధవ్ ఇరవై ఏళ్ల పాటు నవ్వులు పూయించిన వేణు మాధవ్, 1997లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన సంప్రదాయం సినిమాతో మొదటిసారి తెరపై కనిపించారు.

దాదాపు 600 సినిమాల్లో నటించిన వేణు మాధవ్, మూడు చిత్రాల్లో హీరోగా కూడా నటించి నవ్వించాడు. కమెడియన్ గా, హీరోగా, నిర్మాతగా సినిమా కోసం రకరకాల పత్రాలు పోషించిన వేణు మాధవ్, సినిమాల్లోకి రాకముందు మిమిక్రి ఆర్టిస్ట్ గా పని చేశారు. ఆ తర్వాత టీడీపీ ఆఫీసులో కూడా పని చేసిన వేణు మాధవ్, గత కొంత కాలంగా సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చారు. కోదాడలో పుట్టిన వేణు మాధవ్, హైదరాబాద్ మౌలాలిలో సెటిల్ అయ్యారు. వేణు మాధవ్ శ్రీవాణిలకి ఇద్దరు పిల్లలున్నారు. రెండు దశాబ్దాల పాటు నవ్వులు పూయించిన వేణు మాధవ్ అకాలమరణంతో తెలుగు సినీ పెద్దలు, స్టార్స్, అభిమానులు అంతా దిగ్బ్రాంతి చెందారు.