Megastar: మెగాస్టార్ ఆచార్య‌లో మ‌రో ప్ర‌తినాయ‌కుడిగా భీష్మ విల‌న్‌..

Megastar: మెగాస్టార్ చిరంజీవి, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం ఆచార్య‌. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే ఈ చిత్రంలో ప్ర‌ముఖ విల‌న్‌, రియ‌ల్‌హీరో సోనూసూద్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ను చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ కూడా సిద్ధ అనే పాత్ర‌లో న‌టిస్తున్నారు. దీంతో ఈ చిత్రం కోసం మెగాభిమానులే కాకుండా సినీ ప్రేక్ష‌కులు కూడా ఎంతో ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి మ‌రో వార్తా ఫిలింన‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది. వార్తా ఏంటంటే..

acharya villon

Megastarఈ చిత్రంలో సోనూసూద్‌తో పాటు మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ విల‌న్ పాత్ర‌లో బెంగాలీ న‌టుడు జిషు సేన్ గుప్తా అని అంటున్నారు. అదేనండీ నితిన్ న‌టించిన భీష్మ చిత్రంలో విల‌న్ జిషు సేన్‌గుప్తా. ప్ర‌స్తుతం Megastarఆచార్య సినిమాలో క‌నిపించ‌నున్న‌ట్లుగా టాక్‌. ఇక ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా.. ఈ సినిమా మే 13న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇకMegastar ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్ట‌ర్ మ‌ణిశ‌ర్మ స్వ‌రాలు అందిస్తుండ‌గా.. ఇందులో పూజాహెగ్దే ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది.