Megastar: నేడు చిరంజీవి దంపతుల పెళ్లిరోజు శుభాకాంక్ష‌లు.. రాంచ‌ర‌ణ్ విషెస్‌!

Megastar: మెగాస్టార్ చిరంజీవి అంటే సినీ ఇండ‌స్ట్రీలో సంచ‌‌ల‌నం. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో నెం-1 హీరోగా వెలుగు వెలిగిన చిరు ఎంతో మంది యంగ్ హీరోల‌కు ఆద‌ర్శం. అటు సినిమాలు చేస్తూ.. మ‌రోవైపు క‌ష్టాల్లో ఉన్నానని ఏవ‌రైనా అంటే.. వెంట‌నే ఆప‌న్న‌హ‌స్తం అందించే మెగా మ‌న‌సున్న మ‌నిషి మెగాస్టార్ చిరంజీవి. ఇప్ప‌టికే చిరంజీవి ఐ, అండ్ బ్ల‌డ్ బ్యాంకు ద్వారా ఎంద‌రికో సేవ‌లందిస్తున్నారు మెగాస్టార్‌. అలాగే వీటితో పాటు త‌న కుటుంబానికి కూడా ఎంతో ప్రాధాన్య‌త ఇస్తాడు Megastarచిరంజీవిగారు. ముఖ్యంగా త‌న భార్య సురేఖ‌పై త‌న‌కున్న ఆత్మీయ బంధాన్ని, ప్రేమ‌ను ప‌లు ఇంట‌ర్వ్యూలో బ‌య‌ట‌పెట్టిన విష‌యం తెలిసిందే. Megastarచిరంజీవి-సురేఖ జంట 1980 ఫిబ్ర‌వ‌రి 20న వివాహ‌బంధంతో ఒక్క‌ట‌య్యారు.

chiru wedding day

దీంతో నేటితో వీరి వివాహ‌బంధం 41ఏళ్లు పూర్త‌య్యాయి. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా.. వీరిద్ద‌రి జంట‌కు 42వ వివాహ వార్షికోత్స‌వ శుభాకాంక్ష‌లు అంటూ.. మెగాభిమానులు, సినీ ప్రేక్ష‌కులు, సెలెబ్రిటీస్ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇక తాజాగా మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ వినూత్నంగా విషెస్ తెలిపారు. Megastarచిరంజీవి త‌న భార్య సురేఖ ల‌తో చెర్రీ-ఉపాస‌న క‌లిసి దిగి ఉన్నా ఫోటోను జ‌త చేస్తూ.. నా అతిపెద్ద బ‌లం వీరే.. మీరిద్ద‌రికీ 42వ వివాహ వార్షికోత్స‌వ శుభాకాంక్ష‌లు అంటూ ట్విట్ట‌ర్‌లో క్యాప్ష‌న్ పెట్టాడు చెర్రీ. ఇదిలాఉంచితే రాంచ‌ర‌ణ్ కీల‌క‌పాత్ర‌ల్లో Megastarమెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న తాజా చిత్రం ఆచార్య‌. ఇందులో రాంచ‌ర‌ణ్ సిద్ధ‌గా చేస్తున్నాడు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఈ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం మే 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.