Bollywood: భార్యతో బైక్‌పై బాలీవుడ్ స్టార్‌ హ‌ల్‌చ‌ల్.. ఫైన్‌ వేసిన‌ పోలీసులు!

Bollywood: ప్ర‌ముఖ బాలీవుడ్ స్టార్ న‌టుడు వివేక్ ఒబేరాయ్ తాజాగా తాను తీసుకున్న వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసాడు. దీంతో ఈ వీడియోను చూసిన పోలీసులు ఆయ‌న‌కు జ‌రిమానా విధించారు. వివ‌రాల్లోకి వెళితే.. వాలంటైన్స్‌డే సంద‌ర్భంగా వికేక్ ఒబేరాయ్ త‌న భార్య‌తో క‌లిసి ఆవెంజ‌ర్ బైక్‌పై రైడింగ్ వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియోను త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ చేస్తూ.. ల‌వ్లీ వాలంటైన్స్‌డే రోజు ఇది మ‌న అద్భుత‌మైన రైడింగ్ అంటూ క్యాప్ష‌న్ పెట్టాడుBollywood. ఇది కాస్తా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారి.. వివాదంలో ప‌డిపోయాడు వివేక్‌Bollywood.

vivek oberoy latest

ఆ వీడియోలో వివేక్ త‌న భార్య‌ను బైక్‌పై ఎక్కించుకుని.. హెల్మెట్ పెట్టుకోకుండా.. అలాగే క‌నీసం మాస్క్ కూడా ధ‌రించ‌కుండా రైడింగ్ చేశాడు. దీంతో ఒబేరాయ్ మాస్క్ ధరించ‌కుండా కొవిడ్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించ‌డ‌మే కాకుండా.. హెల్మెట్ ధ‌రించ‌కుండా ట్రా‌ఫిక్ నిబంధ‌న‌లు కూడా ప‌ట్టించుకోకుండా బైక్ రైడింగ్ చేశాడ‌ని ఆరోపిస్తూ సామాజిక కార్య‌క‌ర్త మీను వ‌ర్గీస్ మ‌హారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్‌.. రాష్ట్ర పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు Bollywoodవివేక్ ఒబేరాయ్‌కు 500 జ‌రిమానా విధిస్తూ ఈ చ‌లాన్‌ను పంపించారు. ఇక దీంతో సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ఈ విష‌యంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. Bollywood వివేక్ ఒబేరాయ్ జీ.. మీరు ఒక సెలెబ్రిటీ.. హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయ‌డం చాలా త‌ప్పు.. ప్ర‌జ‌లు, అభిమానులు మిమ్మ‌ల్ని అనుస‌రిస్తార‌నే విష‌యాన్ని గుర్తుంచుకోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలాఉంచితే.. తెలుగులో వివేక్ ఒబేరాయ్.. రామ్‌గోపాల్‌వ‌ర్మ తెర‌కెక్కించిన ర‌క్త చ‌రిత్ర సినిమాలో ప‌రిటాల ర‌వీంద్ర పాత్ర‌ను పోషించాడు. అలాగే రాంచ‌ర‌ణ్ విన‌య విధేయ రామ సినిమాలో ప్ర‌తినాయ‌కుడిగా చేశాడు. దీంతో తెలుగు ప్రేక్ష‌కుల్లో కూడా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు వివేక్ ఒబేరాయ్‌.