టాలీవుడ్ హీరోయిన్‌కు అరుదైన వింత వ్యాధి

హీరోయిన్ మాళవిక శర్మ అరుదైన వింత వ్యాధితో బాధపడుతోంది. తాజాగా తనకు ఉన్న వింత వ్యాధి గురించి ఆమె స్వయంగా షాకింగ్ విషయాలు బయటపెట్టింది. క్లెప్లమేనియాక్ అనే విచిత్రమైన మానసిక సమస్యతో బాధపడుతుందట. ఈ వ్యాధి ఉన్నవారికి దొంగతనాలు చేయాలని అనిపిస్తుందట. చిన్న చిన్న వస్తువుల నుంచి పెద్ద వస్తువుల వరకు దొంగతనం చేయాలని అనిపిస్తుందట.

malavika sharma

ఏదైనా కళ్ల ముందు కనిపించినప్పుడు దానిని ఎలాగైనా దొంగలించాలని అనిపిస్తుందట. ఈ వ్యాధి వల్ల ఆమె చాలా సంవత్సరాల నుంచి బాధపడుతుందట. ఇలాంటి వింత సమస్య చాలామందికి ఉంటుందట. మాములుగా వేరే వారికి ఉన్నా అంతగా ఇబ్బంది ఉండదు.

కానీ హీరోయిన్‌కే ఇలాంటి వ్యాధి ఉండటం వల్ల ఆమె చాలా ఇబ్బంది పడుతుండట. ఈ సమస్య ఉండటం వల్ల చాలాసార్లు ఇబ్బంది పడ్డానని, చిన్న చిన్న వస్తువులు దొంగతనం కూడా చేశానని మాళవిక శర్మ చెబుతోంది. ‘నేల టికెట్’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత రామ్ హీరోగా వస్తున్న ‘రెడ్’ సినిమాలో నటించింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది ఈ భామ. కానీ దానికి భిన్నంగా తాజాగా చీరలో ఉన్న ఫొటోలను పోస్ట్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి.