మరో రికార్డు సృష్టించిన ‘బుట్టబొమ్మ’

అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో పూజాహెగ్దే హీరోయిన్‌గా నటించిన అల వైకుంఠపురములో సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. లాక్‌డౌన్‌కు ముందు వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసినట్లు సినిమా యూనిట్ చెప్పింది. ఇక ఇందులోని పాటలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ముఖ్యంగా బుట్టబొమ్మ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా బాగా పావులర్ అయింది.

తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందింగా.. ఇందులోని పాటలన్నీ హిట్ అయ్యాయి. ఇప్పటికే యూట్యూబ్‌లో అనేక రికార్డులు సృష్టించిన బుట్టబొమ్మ సాంగ్.. తాజాగా మరో రికార్డు నమోదు చేసింది. యూట్యూబ్‌లో 450 మిలియన్ల వ్యూస్, 2.99 మిలియన్ల లైక్స్ సాధించిన సాంగ్‌గా నిలిచింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంబరిపడిపోతున్నారు. ఇప్పటివరకు తెలుగులో ఏ పాటకు ఇంత రెస్పాన్స్ రాలేదని చెబుతున్నారు.

ఇక రాములో రాములా పాటకు ఇప్పటివరకు 250 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ‘బుట్టబొమ్మ’ సాంగ్ రామజోగయ్య శాస్త్రి రాయగా.. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటను అర్మాన్ మాలిక్ పాడాడు.