హీరోయిన్ ధరించిన ఈ డ్రెస్ ధర ఎంతో తెలుసా?

బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా ధరించిన డ్రెస్ గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దాని పేరు జాస్ మనక్ లెహెంగా. పొరలు పొరలుగా డిజైన్ చేసిన తీరుకు ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు. అలాగే అందులో ఉపయోగించిన మెటల్ చాలా కాస్ట్ లీ. తాజాగా జరిగిన నేహాకక్కర్ పెళ్లి వేడుకలో ఊర్వశి ఈ డ్రెస్ ధరించింది.

urvasi routela

ఆమె ఆ డ్రెస్ ధరించి పెళ్లిలో పాల్గొన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఆ డ్రెస్ ధర ఎంత ఉంటుందని ప్రతిఒక్కరూ చర్చించుకుంటున్నారు. దాని ఖరీదు రూ.55 లక్షలు అని తెలుస్తోంది. ఇది తెలుసుకున్న అభిమానులు అవాక్కమవుతున్నారు. అంత ధర పెట్టి డ్రెస్ కొనడం అవసరమా? అని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

హేట్ స్టోరి సినిమాతో బాలీవుడ్‌లో హీట్ పెంచేసిన ఈ అమ్మడు.. వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంది. ప్రస్తుతం పలు సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటోంది.