ఈ వారం బిగ్‌బాస్ నుంచి ఆమె ఎలిమినేట్?

బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ప్రతివారం ఆసక్తికరంగా ఉంటుంది. ఎవరు ఎలిమినేట్ అవుతారనే చర్చ ప్రతివారం జరుగుతూనే ఉంటుంది. ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రతిఒక్కరూ ఆసక్తి చూపుతూ ఉంటారు. ప్రస్తుతం హౌస్‌లో మరో ఏడుగురు మాత్రమే ఉండటం, షో కూడా తుది దశకు చేరుకున్న క్రమంలో ఈ వారం ఎవరూ ఎలిమినేట్ అవుతారనేది సస్పెన్స్‌గా మారింది.

bigboss 4

ఈ వారం నామినేషన్‌లో అవినాష్, అఖిల్, అరియానా, మోనాల్ ఉన్నారు. వీరిలో చూసుకుంటే అవినాష్ బాగా ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నాడు. దీంతో అతడు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు లేవు. ఇక అఖిల్‌కు స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరుంది. దీంతో అతడు కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు లేవు. ఇక మిగతావారితో చూసుకుంటే మోనాల్, అరియానాలకు కాస్త వీక్ కంటెస్టెంట్స్‌గా పేరుంది.

దీంతో వారిద్దరు ఈ వారం డేంజర్ జోన్‌లో ఉన్నారు. మోనాల్‌కి తక్కువ ఓట్లు పడుతున్నా.. ప్రతివారం బిగ్‌బాస్ సేవ్ చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో ఈ వారం అరియానా ఎలిమినేట్ అవ్వనుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలోనే ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అరియానా అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో..