Maheshbabu: స‌ర్కార్ వారి పాట కోసం మ‌హేశ్ జిమ్ క‌స‌ర‌త్తులు..

Maheshbabu: సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు తాజా చిత్రం స‌ర్కార్ వారి పాట. ఈ చిత్రానికి పరుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. ఇందులో మ‌హేశ్ స‌ర‌స‌న కీర్తి సురేశ్ హీరోయిన్‌గా చేస్తోంది. ఇటీవ‌లే ఈ చిత్ర మొద‌టి షెడ్యూల్ కోసం దుబాయ్ వెళ్లిన విష‌యం తెలిసిందే. అయితే ఏ సినిమాకు ప‌డ‌నంత క‌ష్టం స‌ర్కార్ వారి పాట కోసం తెగ క‌ష్ట‌ప‌డుతున్నాడు మ‌హేశ్‌.. ఎందుకంటే ఆయ‌న వ‌య‌స్సు పెరుగుతుంది క‌దా.. కానీ యంగ్ లుక్‌లోనే క‌నిపిస్తున్నాడు.. అస‌లు ఏంటీ విష‌యం.. మ‌హేశ్ యంగ్ లుక్ కోసం గ‌తేడాది నుంచే జిమ్ క‌స‌ర‌త్తులు చేస్తున్నార‌ట‌.. ఇప్ప‌డు తాజాగా న‌మ్ర‌తా Maheshbabuమ‌హేశ్ ఫోటోను సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేస్తూ..

maheshbabu

గ్రేట్ మ్యాన్‌.. కాలం గ‌డుస్తున్న కొద్దీ త‌న వ‌య‌స్సు త‌గ్గిపోతుంది. అంటూ న‌మ్ర‌తా పోస్ట్ చేసింది. అలాగే మ‌హేశ్ గురించి న‌మ్ర‌తా ఓ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని త‌న ఇన్‌స్టాలో తెలిపింది. Maheshbabuమ‌హేశ్, నేను స‌ర్కార్ వారి పాట కోసం దుబాయ్‌కు వెళ్లాం.. మేము దుబాయ్‌లో దిగిన రోజు నుంచి మ‌హేశ్ ప్ర‌తిరోజు జిమ్‌లో ఉన్నాడు. క‌స‌ర‌త్తులు చేస్తూనే ఉన్నాడు. ఆయ‌న‌తో పాటు నేను కూడా జిమ్ క‌స‌ర‌త్తులు చేశాను.. ఇలా చాలా వ్యాయామాలు చేసేవాళ్లం. షూటింగ్ అయిపోగానే సాయంత్రానికి జిమ్‌లో ఉండేవాళ్లం. దీంతో ఆ సినిమా కోసం దుబాయ్ ఏడారిలో వేసిన షూటింగ్ సెట్‌లో స‌వాళ్లు ఎదురైనా క్ర‌మం త‌ప్ప‌క జిమ్‌కు వ‌చ్చేవాడు Maheshbabuమ‌హేశ్‌. వ్యాయ‌మం గంట పాటు చేస్తాడు. ప్ర‌తిరోజూ త‌న‌కు తాను ముందుకు సాగేలా జాగ్ర‌త్త‌గా ఉంటాడు. ప్ర‌తి వ్యాయామాన్ని క్ర‌మ‌శిక్ష‌ణ‌తో చేస్తాడు. అందుకే Maheshbabuమ‌హేశ్ యంగ్ లుక్‌లో క‌నిపించ‌డానికి కార‌ణం త‌న నిజాయితీ, ప‌ట్టుద‌ల‌కు ఇవే నిదర్శ‌నం.. కాలంతో పాటు బెట‌ర్ అవుతూ.. వృద్ధాప్యాన్ని వెన‌క్కి నెట్టెస్తున్నాడు అంటూ ఇన్‌స్టా వేదిక‌గా న‌మ్ర‌తా లేఖ‌లో తెలిపింది. ఇక స‌ర్కార్ వారి పాట చిత్రానికి ఎంబీ ప్రోడ‌క్ష‌న్స్‌, 14రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా.. ఎస్.ఎస్‌.త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.