మహేష్-రాజమౌళి కాంబోపై మైండ్ బ్లోయింగ్ అప్డేట్

ప్రస్తుతం ఎన్టీఆర్-రాంచరణ్ కాంబినేషన్‌లో దర్శకధీరుడు రాజమౌళి RRR సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి ఒక సినిమాను తెరకెక్కించన్నాడు. ప్రస్తుతం పరుశురామ్ డైరెక్షన్‌లో సర్కారువారిపాట సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే దుబాయ్‌లో దీని షూటింగ్ ప్రారంభమవ్వగా.. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల కానుంది. ఇక RRR అక్టోబర్ 13న విడుదల కానుంది.

MAHESH AND RAJAMOULI

మహేష్ బాబు సర్కారువారి పాట షూటింగ్ పూర్తయ్యేలోపు RRR షూటింగ్ కూడా పూర్తవుతోంది. దీంతో ఆ తర్వాత రాజమౌళి-మహేష్ సినిమా ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఛత్రపతి శివాజీ కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇందులో మహేష్ ఛత్రపతి శివాజీగా కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది.