ప్రముఖ నటుడు మృతి

ప్రముఖ హాలీవుడ్ టీవీ నటుడు డస్టిన్ డైమండ్ తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా కణ క్యాన్సర్‌తో ఫ్లోరిడాలోని ఒక ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతుండగా.. ఈ క్రమంలో ఆరోగ్యం మరింత క్షిణించడంతో మరణించారు. ఈ విషయాన్ని ఆయ న తండ్రి మార్క్ డైమండ్ తెలిపారు. డస్టిన్ డైమండ్ వయస్సు 44 సంవత్సరాలు.

Hollywood Actor Dustin Diamond

సెవ్డ్ బైది బెల్ సీరియల్‌తో బాల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న డస్టిన్ డైమండ్. ప్రముఖ ఛానల్ ఎన్‌బీసీలో ప్రసారమయ్యే ఈ సీరియల్.. అప్పట్లో చాలా పాపులర్ అయింది. ఆ తర్వాత చాలా సీరియల్స్‌తో ఆయన నటించారు.