Ajith: ప‌దివేల కిలోమీటర్లు బైక్‌పై వెళ్లిన తాలా అజిత్‌..

Ajith: త‌మిళ‌నాడు సినీ ఇండ‌స్ట్రీలో తాలా అజిత్ అంటేనే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. త‌మిళ్ సినీ ప్రేక్ష‌కుల్లో ఆయ‌న క్రేజ్ ప్ర‌త్యేకం. ఎలాంటి అండ లేకుండా స్టార్‌గా ఎదిగాడు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌తో త‌న మార్కెట్‌ను అంత‌కంత‌కూ పెంచుకున్నాడు. త‌మిళ్‌లో ప‌వ‌ర్ ప్యాక్డ్ మాస్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న న‌టుడు అజిత్‌. అన‌వ‌స‌ర వివాదాల‌కు దూరంగా ఉండే అజిత్.. అభిమానుల‌కు కూడా కాస్త దూరంగానే ఉంటాడు.

Thala ajith

కానీ అజిత్‌కు బైక్ రైడింగ్ అంటే ఎంతో ఇష్టం.. Ajith ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌లే బైక్ న‌డుపుకుంటూ ప‌దివేల కిలోమీట‌ర్లు వెళ్లిపోయాడు. చెన్నై నుంచి ప్రారంభ‌మైన అజిత్ జ‌ర్నీ.. కోయంబ‌త్తూర్ హైద‌రాబాద్ మీదుగా వార‌ణాసి గాంగ్ ట‌క్ ల‌క్నో అయోధ్య వంటి ప్రాంతాల‌ను త‌న బీఎండ‌బ్ల్యూ బైక్‌పై సంద‌ర్శించాడు. దీంతో ప‌ది వేల కిలోమీట‌ర్లు పైనే క్రాస్ చేశాడ‌ట‌. ఆయ‌న‌తో పాటు ముగ్గురు స‌న్నిహితులు క‌లిసి వెళ్లార‌ట‌. ఇప్ప‌డీ ఈ వార్తా కోలీవుడ్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఇక ప్ర‌స్తుతం అజిత్ న‌టిస్తున్న చిత్రం వ‌లిమై. ఈ చిత్రాన్ని హెచ్‌. వినోద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. ఈ చిత్రానికి నీర‌వ్ షా సినిమాటోగ్ర‌ఫి అందిస్తున్నారు Ajith.