రిలీజ్ డేట్‌లు వచ్చేస్తున్నాయి.. ఇప్పుడు ‘మహాసముద్రం’ అప్డేట్

టాలీవుడ్‌లో సినిమాల పండుగ మొదలైంది. వరుస పెట్టి మేకర్స్ సినిమా రిలీజ్ డేట్‌లను ప్రకటిస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించేందుకు దర్శక, నిర్మాతలు పోటీ పడుతున్నాయి. గురువారం ఒక్కసారిగా ఐదు సినిమా రిలీజ్ డేట్‌లు వచ్చాయి. F3,విరాటపర్వం, సిటీమార్, గని, పుష్ప రిలీజ్ డేట్‌లను మేకర్స్ ప్రకటించగా.. ఇవాళ కూడా పలు సినిమాల రిలీజ్ డేట్‌లను ప్రకటిస్తున్నారు.

MAHASAMUDRAM RELEASE DATE

అందులో భాగంగా తాజాగా శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా RX 100 ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న మహాసముద్రం రిలీజ్ డేట్ వచ్చేసింది. ఆగస్టు 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.