RRR Movie: “ఆర్ఆర్ఆర్” తారక్ హీరోయిన్ పోస్ట‌ర్ రిలీజ్‌‌..

RRR Movie: ద‌ర్శ‌క దిగ్గ‌జ రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి ఓ స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు చిత్ర‌యూనిట్‌.. ఈ సినిమాలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో నటిస్తున్నార‌ని విష‌యం తెలిసిందే. అయితే చ‌ర‌ణ్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియ‌భ‌ట్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. తార‌క్ జోడీగా హాలీవుడ్ భామ ఒలీవియా మోరీస్ సంద‌డి చేయ‌నుంది.

RRR morris poster

RRR Movie కాగా ఈ మేర‌కు తాజాగా ఈ హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. RRR Movie ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది. ఇక ఈ సినిమాలో అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో చ‌ర‌ణ్ పోషిస్తుండ‌గా, తారక్ కొమురం భీం పాత్ర‌ను పోషిస్తున్నారు. RRR Movie ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అజ‌య్ దేవ్‌గ‌ణ్, న‌టి శ్రియ‌, ప్ర‌ముఖ న‌టుడు సముద్ర‌ఖ‌ని ఓ కీల‌క‌పాత్ర‌ల్లో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాత డీవీవీ దాన‌య్య నిర్మిస్తుండ‌గా.. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 13న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది ఆర్ఆర్ఆర్.. RRR Movie ఈ చిత్రానికి ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎమ్.ఎమ్‌. కీర‌వాణీ సంగీతం స‌మ‌కురుస్తున్నారు.‌