Tollywood: “స‌న్ ఆఫ్ ఇండియా ఫ‌స్ట్ లుక్‌”తో ర‌చ్చ చేస్తున్న‌ డైలాగ్ కింగ్‌!

Tollywood: టాలీవుడ్ డైలాక్ కింగ్ మోహ‌న్‌బాబు న‌టిస్తున్న తాజా చిత్రం స‌న్ ఆఫ్ ఇండియా. తాజాగా ఈ చిత్రం నుంచి ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతుండ‌గా.. శ్రీ ల‌క్ష్మీ ప్ర‌సన్న పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై మంచు విష్ణు నిర్మిస్తున్నారు.ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ సినిమాలో విరూపాక్ష పాత్ర‌లో మోహ‌న్‌బాబు క‌నిపించ‌నుండ‌గా..

mohanbabu poster

Tollywood శ్రీ‌కాంత్ ఓ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నాడు. అలాగే త‌నికెళ్ల‌భ‌ర‌ణి, అలీ, వెన్నెల కిషోర్‌, ర‌ఘుబాబు త‌దితరులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇక ఈ సినిమా విష‌యానికొస్తే.. తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతుంద‌ని, త్వ‌ర‌లో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు Tollywood చిత్ర‌బృందం వెల్ల‌డించింది.