బిగ్‌బాస్‌-4లోకి అతడు రీఎంట్రీ?

బిగ్‌బాస్-4 ఇప్పటికే 10 వారాలు పూర్తిచేసుకుని 11వ వారంలోకి అడుగుపెట్టింది. మరికొద్ది రోజుల్లో బిగ్‌బాస్ షో పూర్తి కానుంది. దీంతో షోకు బూస్టప్ ఇచ్చేందుకు నిర్వాహకులు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే దసరా రోజున సమంతతో హోస్టింగ్ చేయించడం, సుమను గెస్ట్‌గా తీసుకురావడం చేశారు. ఇప్పుడు షోకు మరింత బూస్టప్ ఇచ్చేందుకు నిర్వాహకులు మరో డెసిషన్ తీసుకున్నట్లు తెలస్తోంది.

kumar sai

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టి కొద్దిరోజుల తర్వాత ఎలిమినేట్ అయిన కుమార్ సాయి మళ్లీ రీఎంట్రీ ఇవ్వనున్నాడని ప్రచారం జరుగుతోంది. హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న కుమార్ సాయిని ఎలిమినేట్ చేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. అతడి ఎలిమినేషన్‌ను ప్రేక్షకులు తప్పుపట్టారు.

ఓటింగ్ ప్రకారం కాకుండా ఇష్టమొచ్చినట్లు ఎలిమినేట్ చేస్తున్నారనే విమర్శలు సోషల్ మీడియాలో వినిపించాయి. దీంతో వచ్చే ఆదివారం కుమార్ సాయి బిగ్‌బాస్ హౌస్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.