రష్మీ, అనసూయ, ప్రదీప్ లాంటి యాంకర్లు ఇక దుకాణం సర్దేసుకోవడమే

బుల్లితెర క్వీన్ సుమకు టీవీ ఇండస్ట్రీలో ఎంత పేరుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె తర్వాత రష్మీ, అనసూయ, ప్రదీప్ కొంచెం యాంకర్లుగా గుర్తింపు పొందారు. అయితే ప్రస్తుతం స్టార్ హీరోలు, హీరోయిన్లు యాంకర్లుగా మారి ప్రేక్షకుల ముందుకు వస్తున్న క్రమంలో త్వరలో రష్మీ, అనసూయ, ప్రదీప్ లాంటి యాంకర్లు దుకాణం సర్దేసుకోవడం ఖాయమనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

anchors

పెద్ద పెద్ద హీరోలు కూడా బుల్లితెర, ఓటీటీలో ప్రసారమయ్యే షోలకు హోస్టింగ్ చేసేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే నాగార్జున, ఎన్టీఆర్, నాని లాంటి హీరోలు హోస్టింగ్ చేయగా.. తాజాగా హీరోయిన్ సమంత కూగా యాంకర్‌గా మారింది. దీంతో రష్మీ, అనసూయ, ప్రదీప్ లాంటి యాంకర్లకు గడ్డుకాలం ఏర్పడబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

స్టార్ హీరోలు యాంకరింగ్ చేస్తుంటే.. రష్మీ, అనసూయ, ప్రదీప్ లాంటి యాంకర్లకు అవకాశాలు తగ్గుతున్నాయి. అలాగే కొత్త కొత్త యాంకర్లు తెరపైకి వస్తున్నారు. దీంతో కొత్తదనం కోసం కొత్త యాంకర్లకు అవకాశాలు ఇస్తున్నారు.