షాకిచ్చిన ప్రేక్షకులు.. ఇండస్ట్రీకి గడ్డు పరిస్థితులే

కరోనా ప్రభావం, లాక్‌డౌన్ తర్వాత ఇటీవల మహారాష్ట్రలో థియేటర్లు ఓపెన్ అయ్యాయి. దీపావళి సందర్భంగా ‘సూరజ్ పె మంగల్’ అనే సినిమాను ఆదివారం థియేటర్లలో విడుదల చేయగా.. కేవలం 10 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఫుల్ అయింది. ప్రభుత్వాలు 50 శాతం అక్యూపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వగా.. 10 శాతం అక్యూపెన్సీ మాత్రమే నమోదు కావడంతో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని అర్థమవుతోంది.

CINEMA THETERS

ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే బాలీవుడ్ సినిమా పరిశ్రమ గడ్డుకాలం ఎదుర్కొకోక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది దీపావళికి విడుదలైన హౌస్‌ఫుల్ 4, సాండ్ కి ఆంఖ్, మేడ్ ఇన్ చైనా సినిమాలు వారాంతంలో రూ .62.47 కోట్లు వసూలు చేశాయి.


మాములుగా స్టార్ హీరోల సినిమా అయితే ప్రారంభ రోజు రూ .20 కోట్ల నుండి రూ .50 కోట్ల మధ్య కలెక్షన్లు ఉంటాయి. అమీర్ ఖాన్ యొక్క థగ్స్ ఆఫ్ హిందోస్తాన్ మొదటి రోజు రూ .50.75 కోట్లు నమోదు చేసింది.