కరోనాకు అసలు వ్యాక్సిన్ రాదు.. సంచలనంగా మారిన బాలయ్య వ్యాఖ్యలు

కరోనాకు వ్యాక్సిన్ రాదంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. విర్గో పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ‘సెహరీ’ సినిమా ఫస్ట్ లుక్‌ను సోమవారం బాలయ్య లాంచ్ చేశాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాలయ్య.. కరోనాకు వ్యాక్సిన్ రాలేదని, అసలు వ్యాక్సిర్ రాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వ్యాక్సిన్ వస్తుందని అంటున్నారని, కానీ అది నిజం కాదన్నాడు. అసలు వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు లేవని, కరోనాతో సహజీవనం చేయాల్సిందేనన్నాడు.

BALAYYA

కరోనా మన జీవితాంతం ఉంటుందని బాలయ్య చెప్పాడు. మనం జాగ్రత్తగా ఉండటం తప్ప మరో మార్గం లేదన్నాడు. ఇవాల్టీ నుంచి కార్తీక సోమవారమని, అయినా సరే తల స్నానాలు చేయవద్దని బాలయ్య సూచించాడు.

కరోనా వ్యాక్సిన్ కోసం సైంటిస్టులు ప్రయోగాలు చేస్తున్న క్రమంలో బాలయ్య చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వ్యాక్సిన్ కోసం సైంటిస్టులు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో బాలయ్య వ్యాఖ్యలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.