ఇస్మార్ట్ ఉస్తాద్ కి పోటిగా రంగంలోకి దిగిన అల్లు అర్జున్ విలన్…

రామ్ పోతినేని హీరోగా ఓ బైలింగ్వెల్ మూవీలో నటిస్తున్నాడు. రామ్ 19వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీకి ఉస్తాద్ అనే టైటిల్ ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు.

తెలుగు తమిళ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కుతున్న ఈ మూవీ రేంజ్ ని పెంచుతూ డైరెక్టర్ లింగుస్వామి హీరో ఆర్యని విలన్ రోల్ కోసం అప్రోచ్ అయ్యాడట. అటు తమిళం, ఇటు తెలుగు భాషలలో క్రేజ్ ఉన్న నటుడిని తీసుకోవాలని భావించిన డైరెక్టర్ ఆర్య అయితే బాగుంటుందని అనుకుంటున్నాడట. అల్లు అర్జున్ నటించిన వరుడు మూవీలో ఆర్య విలన్ గా నటించి మెప్పించాడు. ఇప్పటికే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, కేరళ స్టార్ ఫాహద్ లాంటి వాళ్లు టాలీవుడ్ లో విలన్ గా చేశారు, చేస్తున్నారు కాబట్ట్టి ఆర్య ఉస్తాద్ మూవీలో నటించడానికి ఓకే చెప్పొచ్చు. మంచి ఫిజిక్, పర్ఫెక్ట్ యాక్టింగ్ చేసే ఆర్య రామ్ పోతినేని కలిస్తే ఉస్తాద్ సినిమా పక్కా హిట్ అయినట్లే.