హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి వచ్చేస్తున్నారు…

హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు లక్ష్యం,లౌక్యం. 2007, 2014లో వచ్చిన ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యి హీరో డైరెక్టర్ లది హిట్ కాంబినేషన్ గా చేసింది. యాక్షన్ అండ్ ఫన్ రెండు బాలన్స్ చేస్తూ హిట్స్ ఇచ్చే ఈ ఇద్దరూ మళ్లీ 7 ఏళ్ళకి కలిశారు. హ్యాట్రిక్ హిట్ ఇవ్వడానికి రెడీ అయిన ఈ కాంబినేషన్ లో మూవీని అధికారికంగా ప్రకటించారు.

ఈ చిత్రం రూపొందనున్నట్లు ఎనౌన్స్ మెంట్ తో పాటు ఓ పోస్టర్ ను విడుదల చేశారు.. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు హిట్ కావడంతో.. ఈ చిత్రం అనౌన్స్ మెంట్ తోనే  సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. గోపీచంద్ కెరీర్ లో 30వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ నిర్మిస్తున్నారు.. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ #గోపీచంద్30 భూపతి రాజా కథని అందించాడు. త్వరలోనే ప్రారంభించనున్న ఈ మూవీలో నటించే ఇతర తారాగణం గురించి త్వరలో అనౌన్స్ చేయనున్నారు.