విజిల్ పోడు కాదు మాస్క్ పోడు…

కరోనా సెకండ్ వేవ్ ఇండియాలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఈ సమయంలో సెలబ్రిటీస్ కూడా సోషల్ మీడియాలో మాస్కులు వేసుకోండి, శానిటైజర్ లు వాడండి అని ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు కరోనా గురించి అవగాహన కల్పించడానికి కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ కూడా తనవంతు కృషిగా ‘మాస్క్ పొడు’ అనే వీడియో సాంగ్ ను షేర్ చేశాడు. మాస్క్ ప్రాధాన్యతను తెలుపుతూ ‘మాస్క్ పొడు’ సాంగ్ వచ్చింది, చెన్నై సూపర్ కింగ్స్ థీమ్ సాంగ్ ని గుర్తు చేసేలా ఉన్న ఈ పాటలో మాస్క్ సరిగ్గా వేసుకోండి అని చెప్పారు. “Best line of defense! #maskpodu wear your mask, wear it tight, wear it right, wear it double!” అంటూ కార్తీ ఈ వీడియోను షేర్ చేశాడు.