స్టార్ హీరో అయినా వాళ్లకి సారీ చెప్పాడు

బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధే. ప్రభు దేవా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో దిశా పఠాని హీరోయిన్ గా నటించింది. భారీ బడ్జట్ మూవీగా తెరకెక్కిన రాధేని రంజాన్ స్పెషల్ గా రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేశారు. అయితే సెకండ్ వేవ్ కరోనా చాలా బలంగా ఇంపాక్ట్ చూపిస్తూ ఉండడంతో మేకర్స్ రాధే సినిమాని ఓటీటీ రిలీజ్ చేస్తున్నారు. కాప్ డ్రామాగా రూపొందిన రాధే బాలీవుడ్ మార్కెట్ కి మంచి బూస్ట్ ఇస్తుంది అనుకుంటున్న టైములో చిత్ర యూనిట్ ఇలాంటి నిర్ణయం అందరికీ షాక్ ఇచ్చింది. హిందీలో ఒక స్టార్ హీరో కమర్షియల్ సినిమా ఇంత భారీ బడ్జట్ లో తెరకెక్కి ఓటీటీలో రిలీజ్ అవ్వడం ఇదే మొదటిసారి.

మే 13న రాధే జీ ప్లాట్ ఫామ్ లో విడుదల కాబోతోన్న సందర్భంగా సల్మాన్ జూమ్‌లో మీడియాతో మాట్లాడుతూ. ”రాధే సినిమాతో లాభాలు సంపాదించాలని ఆశించిన థియేటర్స్ యజమానులందరికీ క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కేవలం ఓటీటీ మరియు అబ్రాడ్‌లోని కొన్ని థియేటర్లలో మాత్రమే సినిమాని విడుదల చేయనున్నాం. పరిస్థితులన్నీ బాగుండి ఉంటే ఇండియాలో కూడా ఖచ్చితంగా థియేటర్లలో విడుదల చేయాలనే అనుకున్నాం. కానీ థియేటర్లన్నీ మూతపడ్డాయి మళ్లీ సిట్యుయేషన్ ఎప్పుడు చక్కబడుతుందో తెలియదు. అందుకే నిర్మాతలు నష్టపోకుండా ఈ రంజాన్‌కి సినిమాని ఓటీటీలో విడుదల చేస్తున్నాం. ఓటీటీలో విడుదలైనా పరిస్థితులన్నీ చక్కబడి, థియేటర్లు తెరుచుకున్నాక సినిమాని థియేటర్లలో విడుదల చేస్తాము” అని చెప్పాడు.