సీఎం రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం ఇచ్చిన సూర్య అండ్ ఫ్యామిలీ

కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య కార్తీలు సోషల్ సర్వీస్ చేయడంలో ఎప్పుడూ ముందుటారు. ఆగ్రమ్ ఫౌండేషన్ తో కష్టాల్లో ఉన్న వాళ్లకి అండగా నిలుస్తూ ఉంటారు. ఈ కరోనా కాలంలో కూడా ఎంతో సేవ చేస్తున్న ఈ ఇద్దరు అన్నదమ్ములు నాన్న శివకుమార్ తో తమిళనాడు సీఎం అయిన ఎంకే స్టాలిన్ ని కలిసి అభినందించి, కోవిడ్ ని ఎదురుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగం అవుతూ సీఎం రిలీఫ్ ఫండ్ కి కోటి రూపాయల విరాళం ఇచ్చారు. కార్తీ సోషల్ మీడియాలో మాస్క్ పోడు సాంగ్ ని కూడా విడుదల చేసి ప్రజలని చైతన్య పరుస్తున్నాడు.