ఈ చిత్రం కొత్త చరిత్ర రాస్తుందా?

చిత్రం… ఈ పేరు వినగానే ఉదయ్ కిరణ్ గుర్తొస్తాడు. తెలుగు సినీ ప్రపంచంలో తనకంటూ క్లీన్ లవర్ బాయ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న ఉదయ్ కిరణ్ గుర్తొస్తాడు. తేజ ఈ సినిమాని యూత్ కి కనెక్ట్ అయ్యేలా మంచి మెసేజ్ తో తెరకెక్కించాడు. అప్పట్లో ఎక్కడ విన్నా కూడా చిత్రం పాటలే వినిపించేవి. 2000లో విడుదలైన ఈ సినిమాకి తేజ సీక్వెల్ అనౌన్స్ చేసి చాలా రోజులే అయ్యింది.

https://youtu.be/dH5nF-EVTFk

ప్రస్తుతం గోపీచంద్ తో అలమేలు మంగ వెంకట రమణ సినిమా చేస్తున్న తేజ, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవగానే చిత్రం 1.1ని పట్టాలెక్కించేలా ప్లాన్ చేస్తున్నాడట. చిత్రం లాగే ఈ మూవీతో కూడా ఒక కొత్త హీరోని పరిచయం చేయడానికి రెడీ అవుతున్నాడట. తేజ, 21 ఏళ్ల తర్వాత రానున్న ఈ సీక్వెల్ లో సురేశ్‌ ప్రొడక్షన్స్‌ అధినేత సురేశ్‌బాబు రెండో తనయుడు అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నాడని తెలిసింది. ఉదయ్ కిరణ్ కి వచ్చిన డెబ్యూ బ్రేక్ అభిరామ్ కి వస్తుందేమో చూడాలి. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.