మూడు సినిమాలు… రెండేళ్ల సమయం…

త‌మిళ సూప‌ర్ హీరో ధ‌నుష్ టాలీవుడ్ పై దృష్టిపెట్టాడు. ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా తెలుగు సినిమాకు ఓకే చెప్ప‌గా… ఇప్పుడు వ‌రుస‌గా తెలుగు డైరెక్ట‌ర్స్ తో మీట్ అవుతూ, సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తున్నాడు. హీరో విజ‌య్ తెలుగులో సినిమా అనౌన్స్ చేయ‌గానే… ధ‌నుష్ శేఖ‌ర్ క‌మ్ముల‌తో సినిమా ప్ర‌క‌టించాడు. ఆ త‌ర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకోకుండానే డైరెక్ట‌ర్ వెంకీ కుడుములతో సినిమా ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది.

తాజాగా ధ‌నుష్ ముచ్చ‌ట‌గా మూడో సినిమాను కూడా ప‌ట్టాలెక్కించిన‌ట్లుగా ప్ర‌చారం మొద‌లైంది. సాహో ఫేం సుజిత్ తో ధ‌నుష్ సినిమా ఉంటుంద‌న్న‌ది తాజా ప్రచారం. సుజిత్ ఓ క‌థ‌తో ధ‌నుష్ ను క‌లిశాడని… త్వ‌ర‌లోనే దీనిపై ధ‌నుష్ నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తాడ‌ని తెలుస్తోంది. ఈ మూడు సినిమాలు కంప్లీట్ చేసేందుకు ధ‌నుష్ కు క‌నీసం రెండు సంవ‌త్స‌రాలైనా ప‌ట్టేలా ఉంది. ఈ సినిమాలు తెలుగుతో పాటు త‌మిళ్, హిందీలోనూ రిలీజ్ కాబోతున్నాయి.