కింగ్ ఖాన్ టైం అప్పుడే అయిపోలేదు, అయిపోదు కూడా…

కింగ్ ఖాన్, బాలీవుడ్ బాద్షా, ఖుదీ బాలీవుడ్, ఫేస్ ఆఫ్ బాలీవుడ్, ట్రూ ఇండియన్ సూపర్ స్టార్… ఇలా చెప్పుకుంటూ పోతే షారుక్ ఖాన్ గురించి, అతను చేసిన సినిమాలు, అతను సాధించిన రికార్డ్స్ గురించి ఒక పుస్తకమే రాయొచ్చు. దాదాపు మూడు దశాబ్దాల పాటు టాప్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న కింగ్ ఖాన్ కి గత కొంతకాలంగా టైం కలిసి రావట్లేదు. ఏ సినిమా చేసిన బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అవ్వడంతో ఇక షారుక్ టైం అయిపొయింది అనే మాట వినిపిస్తోంది. నిజానికి నిన్న మొన్నటి వరకూ ఇండియన్ సినిమానే శాశించిన వ్యక్తికి ఒక ఫ్లాప్ తోనే ఎండ్ కార్డు పడుతుంది అంటే అంతకు మించిన భ్రమ మరొకటి ఉండదు. ఒక్క పర్ఫెక్ట్ హిట్ పడితే చాలు, ఇప్పుడు టైం అయిపొయింది అన్న వాళ్లే, కింగ్ ఖాన్ ఈజ్ బ్యాక్ అంటారు.

sharukh to team up with atlee

అలాంటి హిట్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న షారుక్ కి ఇప్పుడు సౌత్ సెన్సేషన్ కలిశాడు. దళపతి విజయ్ లాంటి స్టార్ హీరోతోనే మూడు సినిమాలు చేసిన అట్లీ, అందులో ఒక హిట్, ఒక ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. మూడో సినిమా బిగిల్ రూపంలో దివాళికి కోలీవుడ్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి రెడీ అయ్యింది. ఒక స్టార్ హీరో, ఒకే డైరెక్టర్ తో మూడు సినిమాలు చేశాడు అంటేనే ఆ పర్సన్ లో ఎంత విషయం ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. హీరో బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లు కథ రెడీ చేసి దానికి కమర్షియల్ ఎలిమెంట్స్ అద్దడంలో దిట్ట అయిన అట్లీ, ఇప్పుడు షారుక్ తో చెయ్ కలపనున్నాడు. ఈ కలయిక గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రమే మిగిలింది. పాన్ ఇండియా మొత్తం ఫాలోయింగ్ ఉండే షారుక్ కి అట్లీ మార్క్ ఎలివేషన్ కలిస్తే బాక్సాఫీస్ కి బొమ్మ కనపడుతుంది. బిగిల్ రిలీజ్ అయిన తర్వాత అట్లీ-షారుక్ సినిమా గురించి అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.