ఆమె రాకతో ఆకాష్ పూరి టైం మారుతుందా?

ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా రొమాంటిక్. పూరి నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి యూత్ లో వేడి పుట్టించింది. ఇంటెన్స్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాలో శివగామి దేవిగా మెప్పించిన రమ్యకృష్ణ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించనుంది. ఈ విషయాన్నీ చిత్ర యూనిట్ అనౌన్స్ చేస్తూ ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టింది. రమ్యకృష్ణ ఫుల్ లెంగ్త్ రోల్ పోషిస్తున్నారని తెలుస్తోంది, ఇవాళే స్టార్ట్ కానున్న హైదరాబాద్‌ షెడ్యూల్‌లో రమ్యకృష్ణ జాయిన్ కానుంది.

కథకి తన క్యారెక్టర్ కి ఎంతో ఇంపార్టెన్స్ ఉంటేనే ఏ సినిమాని అయినా రమ్యకృష్ణ ఒప్పుకుంటుంది. అలాంటిది రమ్యకృష్ణ రొమాంటిక్ లో ఆమె నటించడానికి ఒప్పుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగే అవకాశం ఉంది. అనీల్ పాడూరి దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ నటులు మకరంద్ దేశ్ పాండే, మందిరాబేడీ కీలకపాత్రలో కనిపించబోతున్నారు. కొడుకుని హీరోగా నిలబెట్టే క్రమంలో పూరి చేస్తున్న ఈ సినిమా ఆకాష్ కెరీర్ ని సెట్ చేస్తుందేమో చూడాలి.