మహేశ్ హీరోయిన్ రష్మిక రెమ్యునరేషన్ చూస్తే సరిలేరు నీకెవ్వరూ అంటారు

రష్మిక మందన… ఈ మధ్య సౌత్ ఇండస్ట్రీలో జపం చేస్తున్న పేరు. ఈ కన్నడ బ్యూటీ చేస్తున్న సినిమాలు అన్నీ వరస పెట్టి హిట్స్ అవుతుండటంతో దర్శకనిర్మాతలు ,హీరోలు రష్మిక వెంట పడుతున్నారు. వరసగా వస్తున్న ఆఫర్లు..హిట్లలతో ఈ బ్యూటీ తన రెమ్యునరేషన్ రేంజ్ ను పెంచిందని టాక్. ప్రస్తుతం విజయ్‌తో డియర్‌ కామ్రేడ్‌ సినిమాలో నటిచింది. గీతగోవిందం సినిమా హిట్ తరువాత ఈ విజయ్, రష్మిక కలిసి నటిస్తున్న సినిమా కావడంతో డియర్ కామ్రేడ్‌పై భారీ అంచనాలున్నాయి. దీంతో పాటు ఈ బ్యూటీ చేతిలో కోలీవుడ్‌లో రెండు, టాలీవుడ్‌లో రెండు, కన్నడలో రెండు సినిమాలు ఉండటంతో రెమ్యూనరేషన్‌ను మరింతగా డిమాండ్‌ చేస్తుందట.

rashmika mandanna

ప్రస్తుతం మహేష్‌బాబు, అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా చేస్తోంది. ఇక తమిళంలో విజయ్ 64 వ లాంటి క్రేజీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ దక్కించుకుంది. ఇందులో రాశి ఖన్నా మరో హీరోయిన్ గా నటిస్తుంది… వరుసగా టాప్ హీరోలతో నటిస్తుండడంతో రెమ్యూనరేషన్‌ రేటు కూడా పెంచేసినట్టు తెలుస్తోంది.నిన్నమొన్నటి వరకు 50 లక్షలకు కాస్త అటూ ఇటూగా డిమాండ్ చేస్తే ఇప్పుడు ఏకాంగా ఒక సినిమాకు కోటి కావాలని కూర్చొందట. ఇటు అఖిల్ 4వ ప్రాజెక్టులోనూ రష్మిక పేరు వినిపించింది కానీ ఆమె ప్లేస్ లో ఇప్పుడు పూజా హెగ్డే వచ్చి కూర్చుంది. అటు సీనియర్ల నుంచి ఇటు జూనియర్ హీరోల వరకు అందరూ రష్మికనే కావాలని డిమాండ్ చేస్తుండడంతో అమ్మడు కొండెక్కి కూర్చొంది. ఈ సినిమాలు హిట్ అయితే మాత్రం రష్మిక సౌత్ లో బిజీ హీరోయిన్ల లిస్ట్ చేరిపోవడం ఖాయం.